“కొడ్కా కొండయ్యా పోతివా!” తెలంగాణ ప్రజల దీన స్థితి ఇలా ఎందుకు తయారయిందో తెలుసుకోవడానికి కమిటీలు కావాలి. వేస్తావా మన్మోహనా ?


తెలంగాణ యువత మావోల ఉద్యమంలో చేరడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారో…  దానికి మూల కారణాలేమిటో….  తెలుసుకోవడానికి  శ్రీకృష్ణ కమిటీని ఉపయోగించుకొని దేశ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగ పరచు. అలా చేస్తావా మన్మోహనా? పోనీ నిన్ను అలా చేయనిస్తారా?

కొడ్కా కొండలు పోతివా!!! (ఈనాడు పత్రికలో చిత్రంతో కూడినa కథనం కన్నీరు పెట్టించింది…)

కొడ్కా కొండయ్యా పోతివా!
ప్రజలగోసలంటివి అన్నల  బాటవడితివి.
నువ్వు పొయిన మొదట్ల పోలిసోళ్ళు
వట్టుకొంటె సూసిన సూసుడే,
మల్ల కనవడక పోతివి కొడ్కా.
నీ సావు ఇనంగనే మా ముసలి గుండెల్త ట్టుకోలే.
నువ్వేం సాధించినవో గని,
మా బతుకులైతె ఇట్లనే ఉన్నయ్.
ఇదిజూడనికే  బతికున్నమారా  కొండలు.
ఈ కడ్పుకోత పగోనిగ్గూడా రావొద్దురా నా తండ్రి. 😦
—  తల్లిదండ్రులు

అయ్యా బతికున్నప్పుడు నీకు గుక్కెడు బువ్వవెట్టలే
సచ్చి నీకు కడ్పుకోత వెట్టిన నన్ను మాఫీజెయ్!
ఈ బలిసి  నోళ్ళు  మన బతుకుల మీద సైన్మాలు దీత్తరు
“పీపుల్స్ వార్ ” అని పేర్లువెడ్తరు
మస్తుగ పైసల్ సంపాయిస్తరు
కని మన బతులకోసం ఏంజెయ్యరు.
అయ్యా! నా త్యాగం ఊరికే పోదయ్యా!
బాధపడొద్దు… ఏడ్వొద్దు… వచ్చే జన్మలగూడ
నీ కొడ్కుగనే పుడ్తా అప్పటికైనా
మన బతుకులు బాగుపడతయేమో సూస్తా!   😦
— కొండల్‌రెడ్డి

(పుత్రశోఖంతో  శాఖమూరి తల్లిదండ్రులు… సాక్షి పత్రిక కథనంలో…)

13 వ్యాఖ్యలు to ““కొడ్కా కొండయ్యా పోతివా!” తెలంగాణ ప్రజల దీన స్థితి ఇలా ఎందుకు తయారయిందో తెలుసుకోవడానికి కమిటీలు కావాలి. వేస్తావా మన్మోహనా ?”

 1. Abhijnana Says:

  😦 poor old parents..pch..

 2. saamaanyudu Says:

  అమర్ రహే కా.కొండారెడ్డి.

  కమిటీల కాలయాపనతో తెలంగాణా యిలా మండుతోంది. తెలంగాణా తల్లి కడుపు కాల్తో౦ది.

 3. GolMal Says:

  శ్రీ కృష్ణ కమిటీ కి వచ్చి మీ ఏడుపులు ఏడవండి , దొంగ సచ్చిన నక్సలట్లకి ఆనక ఇంకో కమిటీ వేస్తాం, ఇంకేం పనుంది అంతకన్నా?

  • bhAskar Says:

   అసలు ఈ కమిటీ ఏర్పడిందే ఉద్యమ వృక్షాన్ని కూకటివేళ్ళతో పీకేసి కాల్చి బూడిద చేయడానికని కొద్దిగా బుర్ర ఉన్నవారెవరికైనా అర్థమౌతుంది. కేంద్రంలో నాయకులు మరియు ఈ అధికారులు పెట్టుబడీదారుల తొత్తులు. తెలంగాణ ప్రజలు నోట నాలికలేని అమాయకులు – ఇలాంటి జిత్తులు rAvu… artham kUDA kAvu. ఈ బలవంతమైన తొత్తులను ఎదుర్కోడానికి ఇంకా పకడ్బంధీగా దూర ఆలోచనలతో ఉద్యమాన్ని నడపాలి.

 4. తెల్గోడు Says:

  ఒరేయ్ ఘోల్ మాలిగా, చీము నెత్తురున్నాదిబే నీకు – చెత్తకంపు కొడ్తున్నాయిరా నీ దరిద్రపు కుళ్ళుబోతు మాటలు. ఛీ థూ నీ బతుకుచెడ

 5. saamaanyudu Says:

  అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం. ఎన్కౌ౦టర్లన్నీ ప్రభుత్వ హత్యలే. తెల౦గాణా బిడ్డలకు చావులేదు.

 6. GolMal Says:

  chaavulEkunTE EDvaTam endukO! hee..hee.

 7. నీరజ Says:

  వాదాలు పక్కన పెట్టి, ఎప్పటికైనా కొడుకు తిరిగొస్తాడని ఎదురు చూసే ఆ వృద్ధ తల్లి దండ్రుల బాధను, దుఃఖాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. ఈ వయసులో ఇంత వేదన తట్టుకోగలరా?

  – నీరజ

 8. మహిశ్రీ Says:

  బాగా చెప్పారు నీరజగారు.

 9. తెల్గోడు Says:

  బావిలో కప్పలకు బయటి ప్రపంచమెంటో కనీసం అవగాహన కూడా లేదు రాదు…

  ఇక్కడి ప్రజల బాధలు ఎక్కడో తెలంగాణేతర ప్రాంతంలోనో లేక హైటెక్కు నగరంలో కూర్చుని – లఘఢఫాఠి లాంటి లుచ్చాగాళ్ళ మాటలు మాత్రమే వినపడే మీ చెవులకు – అసలు అమాయక ప్రజలకు జరుగుతున్న అన్యాయమేంటో ఏం తెలుస్తది.

  చెవ్టోని చెవుల శంఖం ఊత్తె ఏమైతది. ఇది రాసుడుగుడా గంతే.

  Every Dog will have its own Day. కామ్రేడ్స్ మీ త్యాగాలు ఊరికే పోవు. ఈ లుచ్చాగాళ్ళను తరిమి తరిమి కొట్టేరోజస్తది.

 10. SNReddy Katanguru Says:

  అమరుడు కొండన్నకు జోహార్లు, ఈ ఆక్రందన మనసున్నోళ్ళ హృదయాల్ని చలింపజేస్తుంది,
  కానీ ఊరూ-పేరూ లేకుండా మొరిగే “గోల్-మాల్” లాంటి కుక్కలకేం తెలుసు?
  తెలంగాణా ఉద్యమంలో అసువులుబాసిన త్యాగమూర్తుల ఆత్మఘోషయే ఇది.
  కొండల్ అమర్ హై! అమరవీరుల లక్ష్య సాధనయే వారికి మనమిచ్చే నివాళి.
  జై తెలంగాణ! జై జై తెలంగాణ!
  —మీ కటంగూరు

 11. Sudhakar Says:

  Its too pity of those old parents.

  Great country.

  The terrorists will enjoy the five star facilities in this country. No government will ever dare to even touch them.

  But these people who started a movement for the cause of suppressed group in society are getting the treatment of death.

  Shame on the democracy.

  They should try to fix the cause why there are still something like Naxalites in this 21st century. Fix the injustice, discrepancy.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: