పొత్తిళ్లలోంచి…

శుక్రవారం, మే 13, 2011

ప్రకటనలు

గుట్టువిప్పి నగ్నంగా నిలబెట్టే చర్చ వీడియో…

శుక్రవారం, ఫిబ్రవరి 25, 2011

సీమాంధ్ర పెత్తనంలోని వార్తాసంస్థల గుట్టువిప్పి కుళ్ళుబోతు దోపిడిదారులచేతుల్లో కీలుబొమ్మ వలసనాయకులను నగ్నంగా నిలబెట్టే చర్చ వీడియో…

Part 1

Part 2

Part 3

కాదేదీ వివక్షనర్హం…

సోమవారం, జనవరి 24, 2011

అని నిరూపించడానికి వెనుకాడరు ఈ వివక్షదారులు. సదుద్దేష్యంతో నిర్మించిన ఓ మాంఛి సినిమా సామాన్య ప్రజలను ఏ రకంగా ప్రభావితం చేయగలదోనన్న విషయం పక్కన పెడితే…  మరి ఒకసారి CBFC వారి Visionను మరియు వారనుసరించే మార్గదర్శకాలను/పద్దతులను పరిశీలించినట్టయితే ఒక ప్రశ్న ఉత్పన్నమౌతుంది… 

మరి వీళ్ళ దగ్గరకొచ్చిన ప్రతి సినిమాను వివక్షారహితంగా ఈ మార్గదర్శకాలనుసరించే దృవీకరిణ పత్రం ఇస్తున్నారా? 

జై బోలో తెలంగాణ సినిమా దృవీకరణ విషయంలో కూడానా?   అబ్బో ఛ!

జై బోలో తెలంగాణ… పాటలు

సోమవారం, జనవరి 10, 2011

http://www.raaga.com/a/?A0002694

జై బోలో తెలంగాణ అందెశ్రీ 

జన జాతరలో మన గీతం
జయకేతనమై ఎగరాలి
జంఝా మారుత జన నినాదమై
జే గంటలు మోగించాలి
        ఒకటే జననం ఓహో…!
        ఒకటే మరణం ఆహా…!
        జీవితమంతా ఓహో…!
        జనమే మననం ఆహా…!
కష్టాల్ నష్టాలెన్నెదురైనా
కార్యదీక్షలో తెలంగాణ
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||
దేశముఖులను దొరభూస్వాముల
గడీల నుండి ఉరికించాం
రజాకారులను తరిమికొట్టి
నైజాముకే గోరి గట్టేశాం
        రోషం గుండెల ఓహో…!
        రోకలి బండలు ఆహా …!
        బిగిసిన పిడికిళ్ళు ఓహో…!
        వడిశెల రాళ్ళు ఆహా…!
వేలకువేలా బలిదానాల
వీరులు చేప్పిన దారుల్లో
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై! బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||
ఆత్మగల్ల మా తెలంగాణకు
అరవై తొమ్మిది గ్రహణం
మూడువందల అరవై తొమ్మిది
విద్యార్థుల బలిదానం
        వంచన వచ్చి ఓహో…!
        పంచను జేరితె ఆహా…!
        సమరాంగణంలో ఓహో…!
        సైంధవులుంటరు ఆహా…!
మోసాలను పసిగడుతూ అమరుల
త్యాగాలను నిలబెట్టే దిశల
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||
తెలంగాణకై విద్యార్థులె
మా ఉద్యమాల తొలి పొద్దులురా…!
ఖాకి జులుం కత్తుల వంతెన
మీద కవాతే చేసిరిరా…!
        ఒడిసిన రక్తం ఓహో…!
        తడిసిన నేల ఆహా…!
        ప్రతినలు బూనిరి ఓహో…!
        ప్రాణాలొడ్డిరి ఆహా…!
నిర్భంధాలు ఎన్నెదురైనా
నిలబడి కలబడి నిగ్గుదేల్చ
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||
నిప్పులు చెరిగే తుపాకీ రవ్వల
గుప్పిట బట్టి నలిపేస్తాం
నెత్తురు చిందె దారుల్లోన
విత్తనాలమై మొలకేస్తాం
        లాఠీలిరిగిన ఓహో…!
        లడాయి మానము ఆహా…!
        పిడుగులు పడ్డా ఓహో…!
        మడమలు తిప్పం ఆహా…!
సమాజ హితమై సాగే పోరులొ
చావో రేవో సాగుదాము
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||

వలస పాలకుల్లారా కౄరత్వమంటే ఇది కాదా?

శనివారం, జనవరి 8, 2011

వలస పాలకుల్లారా కౄరత్వమంటే ఇది కాదా? – మరీ ఇంత అన్యాయమా నా తెలంగాణపై

telanganaonline | January 07, 2011 | 0 likes, 0 dislikes

two injured students of Osmania university were being taken to the hospital, when a battalion of para military forces dragged them out of the ambulance & charged them – (the video has no Audio)

Later the lawyers who protested against this repression against the OU students were also man handled.

* here’s another Tiananmen square in the making

 

వొత్తిల్లకు తలొగ్గక నిజం ప్రతిబింబించిన ఒకే ఒక చానెల్ 

RAJ NEWS CHANNEL – Live streaming.

ఆంధ్రోళ్ళ వొత్తిడికి తలొగ్గిన వార్తాసంస్థలు ప్రసారం చేయని వీడియో…

శుక్రవారం, జనవరి 7, 2011

Video: క్రింద లింకు క్లిక్ చేయండి – ఇదీ తీసేస్తారేమో త్వరగా చూసేయండి
Telangana WarZone in Osmania and Kakateeya Universities Jan 6th 2011

ఇదో శ్రీకృష్ణ ఏకాభిప్రాయాస… రిపోర్టు.

గురువారం, జనవరి 6, 2011

CCSAP-REPORT-060111.pdf

ఒక రెండొందల క్లిక్కుల తరువాత 45 నిమిషాలు పట్టింది పూర్తిగా డౌన్‌లోడ్ అవడానికి….

చాంతాడంతటి రిపోర్టులో ఈ క్రింది ఒక్క విషయం చాలు తెలంగాణ రాష్ట్రం తిరిగిచ్చేయడానికి… అష్టవంకర్లు పడవలసిన అవసరం లేదు శ్రీకృష్ణ.

7.15.06 Festivals, Traditions and Customs:

 

Again, it is claimed that festivals like Bathukamma, Bonalu, Dashera, Deepavali, Holi, Peera Panduga (Muslim festival), Jataras (festival of tribals and Dalits) are celebrated in Telangana but not in coastal Andhra and not given recognition in the state. Rituals followed in marriages are also not the same between the regions. It is argued that “the style of clothing and colours favoured in the two regions is different and coastal Andhra people look down upon Telangana people‟s clothing style and eating habits and compare them in public with tribal people. People in Telangana villages worship Gods like Pochamma, Yellamma, Maaremma, Mallamma, Mysamma, Uradamma, Andalamma, Beerappa etc. The coastal Andhra people laugh at these names as they are „local‟ names unlike the Gods in coastal Andhra who have Sanskrit names. Coastal Andhra festivals, which are celebrated by four or five mandals, are highlighted as Telugu culture and are perpetuated through the school syllabus. But Telangana festivals (like Bathukamma and Bonalu), which are celebrated in all ten districts of Telangana,are not mentioned in text books  

జై తెలంగాణ జై జై తెలంగాణ

చెత్త నాయకుల చిల్లర రాజకీయాలు

మంగళవారం, నవంబర్ 30, 2010

ఐకమత్యమే మహాబలం అనే నీతి చిన్న పిల్లలకు మాత్రమే… అని కుండబద్దలు కొట్టినట్టు తమ చేతల్లో నిరూపించేసారు మన రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ రాజకీయ నాయకులు.

అధిష్టానం మెడలు వంచడం చేతకాక కేంద్రంలో అత్యల్పంగా పదవులు పొంది ఏమాత్రం ఆధిపత్యం సాధించలేక తమ చెత్త ప్రవర్తనతో అందరూకలిసి మొత్తం రాష్ట్రానికే తలవంపులు తెచ్చారు. అత్యధికంగా లోకసభ సభ్యులనందించి కేంద్ర సర్కారుకు తోడ్పడ్డామని కాలరెగిరేసి తిరిగే సమైఖ్యరాష్ట్రవాదులు ఇప్పుడేమంటారో మరి. 

మన రాష్ట్రం కంటే ఎంతో చిన్న రాష్ట్రాలనుండి ఎన్నికై వచ్చిన వారికి అధిష్టానంలో దొరికిన ప్రాతినిధ్యంతో పోలిస్తే మనవారికి అసలేమి లేదనే అనొచ్చు.

ఇదేనా సమైఖ్య రాష్ట్రంతో సాధించింది?

రాష్ట్రంలో నాయకత్వ లక్షణాలే కరువయ్యాయా లేక నిజమైన నాయకులను పైకి రానీయకుండా తొక్కిపేట్టే కుళ్ళుబోతు ప్రవర్తన కారణమా… తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో కిరణ్‌కు పట్టాభిషేకం వెనుక కేంద్రంలో ఎంత తర్జన భర్జన జరిగిందో ఊహించడం సులభం.  ఇక ఎన్నికచేసుకున్న మంత్రివర్గం చూస్తే రెడ్డి రాజుల కాలం గుర్తుతెచ్చుకోవచ్చు. ఈ కులవర్గాల గజ్జి ఎక్కడివరకు పాకిపోతోందో ఊహించడం కష్టం.

ఓ మహత్మ  ఈసారి మరో స్వాతంత్ర్యోద్యమం చేయడానికి నువ్వు తెలుగువాడిగా మళ్ళి పుట్టాలి…

నక్కతోకను తొక్కినట్టు వచ్చిపడ్డ కొత్త ముఖ్యమంత్రిగారు ఇక ప్రజలకు ఓ మాంఛి రాజకీయ క్రికెట్టు మ్యాచ్ చూపిస్తారని అశిస్తూ…  చెత్త నాయకుల మధ్య చిల్లర రాజకీయాలతో సుఖంగా పరిపాలించేసుకోవాలని  శుభాకాంక్షలతో…

అప్పటికిప్పటికి ఫరకేముంది…!

ఆదివారం, సెప్టెంబర్ 19, 2010

1969 సెప్టెంబర్ 23న రాష్ట్ర శాసనసభలో ఈశ్వరీబాయి (ఈనాటి రాష్ట్ర మంత్రి డా. గీతారెడ్డికి మాతృమూర్తి) చేసిన ప్రసంగం చదివితే తెలిసొచ్చే పచ్చి నిజాలు అందరికి తెల్వాలె. ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మయ్యకు ఈనాటి రోషయ్యకు ఫరకేమన్న ఉన్నదా?     లే!    పోనీ ఆనాటి అధిష్టానానికి ఉన్న ఫకరుకు మరి ఈనాటి అధిష్టానానికి ఉన్న ఫకరుకు ఫరకేంటిది?    ఏంలేదు!    చదవండి తెలుస్తది….   ఏ కేసిఆరో లేక కోదండరామో చెప్తెనే  రెచ్చిపోయి ప్రజలుధ్యమించారని ప్రగల్బాలు పలికే కుంచిత నీచ్ కమీనే కుళ్ళుబోతు ఆంధ్రోళ్ళకు ధీటుగా ఇప్పుడు మేలుకొన్న తెలంగాణ ప్రజలు తిరగబడాలె…

1969లో..
-జె. ఈశ్వరీబాయి

పంచ పాండవుల అరణ్యవాసం మాదిరి 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో తెలంగాణ వారు ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి కాని పని ఏమికావలసి ఉన్నది? ఈనాడు 80వేల మంది పిల్లలు నిరుద్యోగంలో ఉన్నారు.  1956లో ఏదయితే పెద్ద మనుషు ల ఒప్పందం జరిగిందో దాని ప్రకారం ఏదీ కాలేదు. ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. వారిలో డాక్టర్స్, ఇంజనీర్స్, టెక్నీషియన్స్, ఎంఏలు, ఎంఎస్‌సీలు ఇంతమంది ఉండగా కూడా వారు ముల్కీస్‌గా ఉండగా కూడా పనులు దొరకకుండా ఎన్నో బాధలకు గురి అయినారు. నిజంగా స్టూడెంట్స్ ఈ మూవ్‌మెంటుని బయటకు తీసుకు వచ్చారు.

మేముకూడా ప్రతిసారి ప్రాంతీయ కమిటీలో అన్యాయం జరిగింది, మిగిలిన డబ్బు తెలంగాణలో ఖర్చు పెట్టడం లేదని తీసుకువస్తే దానిపైన ముఖ్యమంత్రి గారు జనవరి 18-19 తేదీలలో మీటింగు కాల్ ఫర్ చేసినారు రెండురోజులు మీటింగ్ అయినది. మరొక ఒప్పందం పైన అందరూ సంతకాలు కూడా తీసుకున్నారు. అప్పుడు ఏమి వచ్చింది? ఆంధ్రులందరినీ పంపించేస్తాము. వారి స్థానంలో తెలంగాణలో పోస్టులు కలుగ చేస్తామన్నారు. అవకాశం లేదంటే పోస్టులు క్రియేటు చేస్తామన్నా రు.

ఆ తరువాత చీఫ్ సెక్రటరీ ఎం.టి. రాజుగారు ఎన్‌జిఓస్‌తో మీరు హైకోర్టుకు పొండి అక్కడ అన్నీ తెలుస్తవి అని ఆ విధంగా నాటకం ఆడి హైకోర్టు పంపించా రు. అక్కడ ఏమి వచ్చింది? తెలంగాణకు వ్యతిరేకంగా ముల్కీలను కొట్టి పారేశా రు. మళ్లా చీఫ్ మినిస్టరుగారిని అడిగాం. ఏమి సంగతి అని. సుప్రీం కోర్టుకి పోతా ము. అక్కడ పోట్లాడుతాం అన్నారు. అక్కడ నుంచి కూడా అదే వచ్చింది. క్యాబినెట్‌లోకూర్చుండీ పదవిపైన ఆశతో పదవి కోసం ప్రాకులాడుతూ తెలంగాణకు ఇంత అన్యాయం జరిగితే ఏమిచేస్తున్నారు?

ఎంతో మంది ప్రాణాలు పోయిన తరువాత ఎన్నో ఇళ్ళు కూలిన తరువాత తల్లి కి పిల్లలు లేకుండా పిల్లలకు తల్లులు లేకుండా పంపిన తరువాత కూడా సమస్య ను పరిష్కరించాలని ఏమయినా ఉందా? పోలీసులను తీసుకువచ్చారు. మద్రాసు పోలీసు, మైసూరు పోలీసు, రాజస్థాన్ పోలీసు, ఉత్తరప్రదేశ్ పోలీసు, కేరళ పోలీ సు 75 వేలమంది పోలీసులు వచ్చారు. ఇదేనా డెమొక్రసీ అని అడుగుతున్నాను. ప్రజాస్వామ్యాన్ని పోటీసులను పెట్టి అణచగలుగుతారా అని అడుగుతున్నాను. పోలీసువారు పిచ్చికుక్కల మాదిరి కనిపించిన వారందరినీ కొడుతున్నారు.

సైకి లు మీద వెళుతున్నవారిని కొట్టడానికి వారికి ఎవరు ఆర్డరు ఇచ్చారు? వారంతా కర్రలను పట్టుకుని కనిపించిన ప్రతివారిని కొడుతున్నారు. ఒకసారి తెలంగాణవారు పోలీసులను రాళ్ళతో కొట్టారనుకోండి. దాని గురించి ఫైరింగ్ చేసి చంపేయడమేనా? ఫైరింగ్ చేయడానికి మెజిస్ట్రేట్ ఆర్డర్సు ఉండాలి. ఆ విధముగా అధికారం లేకుండా చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకున్నారు. మూడవ సంవత్సరంలో ఒక కొడుకు తరువాత ఒక కొడుకుని పెట్రోలు పోసి కాల్చి పారేశారు. చాలా ఇన్సిడెంట్సు ఉన్నాయి.

రోడ్డు మీద పిల్లలు రాళ్ళు కొడుతున్నారని ఫైరు చేశారు. జామియా ఉస్మానియాలో చంపేశారు. 250 సంవత్సరాలు పరిపాలించి మనలను బాధలుపెట్టిన బ్రిటీషు వారు కూడా చేయని విధంగా బందూకులు ప్రయోగించారు. రాళ్ళు కొడితే టియర్ గ్యాస్‌లేకపోయినాదా? లాఠీల లేకపోయినవా? ఫైర్ ఎయిర్‌లో చేయడానికి అవకాశము లేకపోయినదా? ఫైర్ చేసినప్పుడు గొంతుకు తగిలి బ్రెయిన్ క్రింద వచ్చి పడినది. భయపడి కొట్లు మూసుకొంటే చెక్కలు పగులగొట్టి కాల్పులు జరిపితే తొడలకు, కాళ్లకు, ఛాతీలోను తుపాకీ గుండ్లు తగిలినవి.

ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే బ్రహ్మానందరెడ్డి గారికి చీమకుట్టినట్లుకూడాలేదు. ఇన్ని అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయివుంటే బ్రహ్మానందరెడ్డిగారు ఢిల్లీ వెళ్ళి ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నది అని చెబుతున్నారు. మాకు బిడ్డలున్నారు. వారికి లేకపోవచ్చును. మిగిలిన మంత్రులకు బిడ్డలు లేరా? వేరే బిడ్డలు మన బిడ్డలు కారా? కర్ఫ్యూ పెట్టిన సమయంలో చిలకలగూడ బస్తీలోని ఒక లేన్‌లో ఒక ముస్లిమ్ పిల్లవానిని ఒక ఎస్ఐ పిస్తోలుతో కాల్చి చంపాడు. తెలంగాణ ప్రజల మీద అంత అన్యాయం, అత్యాచారం జరిగింది అంటే ఏమి చెప్పాలి? అన్నదమ్ములుగా విడిపోయి స్నేహంగా ఉండడానికి ప్రయత్నము చేయడం మంచిది. దానికిగాను వెంటనే ప్రెసిడెంటురూలు కావాలి. దానిని ఒప్పుకొనకపోతే సివిల్ వార్‌కి తయారు కావాలని చెబుతున్నాను.

తొమ్మిది నెలలుగా ఈ ఉద్యమం సాగుతున్నదంటే సాగనిచ్చిన వారెవరు? ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రిగారు కాని మిగతా మంత్రులు గాని ఏమి చేశారని అడుగుతున్నాను. పిల్లల ఉద్యమం అంటున్నారు కదా. వారిని పిలిచి నచ్చచెప్పి మీ కోరికలు ఏమిటి అని అడిగారా-అడుగలేదు. కనివిని ఎరుగని ఉద్యమం ప్రారంభమై తొమ్మిది నెలలైనా ఇంకా సాగనిస్తున్నారంటే కారకులు ఎవరు?ఈ తొమ్మిది నెలల్లో చచ్చినవారు 350 మంది. అందులో 18 మంది లాఠీ చార్జి వల్ల చచ్చిన వారున్నారు.

70 వేల మంది ప్రజలు అరెస్టు అయినారు. అందులో 7 వేల మంది స్త్రీలు. పి.డి.చట్టం క్రింద 300 మందిని అరెస్టు చేశారు. తెలంగాణ జిల్లాల్లో 3,266 సార్లు లాఠీచార్జి చేశారు. దెబ్బలు తగిలినవారు 20 వేల మంది. రక్తపు గాయాలు11,551 మందికి కలిగాయి. ఫ్యాక్చర్సు బులెట్ దెబ్బలు1,840 మందికి తగిలాయి. 1,870 సార్లు టియర్ గ్యాస్ వాడారు. 1942 క్విట్ ఇండియా ఐదు సంవత్సరాల ఉద్యమంలో ఇంతగా జరుగలేదు. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఎందుకు కావలసి వచ్చింది అని ఒకసారి ఆలోచించుకుంటే మనకు ఈ అవకతవకలు, ఒకరిని ఒకరు అనుకోవడం ఉండదనుకుంటాను.

– ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రముఖుల ప్రసంగాలు’ నుంచి ఆంధ్రజ్యోతి సౌజన్యంతో

 
చివరగా కాలోజీ వాఖ్యతో…
 
తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు భాషీయుల 
‘సుహృద్భావన’ ఎంతని వర్ణించుట సిగ్గుచేటు
వాక్యంలో మూడుపాళ్ళు ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో ఉర్దూపదం దొర్లగానే హిహీ అని
ఇగిలించెడి సమగ్రాంధ్ర వాదులను ఏమనవలెనో తోచదు.
‘రోడ్డని’ పలికేవారికి సడకంటె ఎవగింపు 
ఆఫీసని అఘొరిస్తూ కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు సిల్సిల అంటే ఉరుదు 
సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు షర్కర్, నాష్తంటే కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు చా అంటే ‘తౌరక్యము’ 
పొయినడంటే చావు తోలడమంటే పశువు దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు త్రోవంటె తప్పు తప్పు దోవంటేనే దారి.  

నాకు తారసపడిన ఓ మూడు మంచి వార్తా విశ్లేషణలు…

శుక్రవారం, ఏప్రిల్ 9, 2010

(అల్‌జజీరా వార్తా సంస్థ వారి సైటు ద్వారా సేకరించినవి)

1. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డు కుక్కల్లా ఈ సంకటాలు

2. కొత్త రాష్ట్రం కొరకు భారత్‌లో పోరాటం

3. రాష్ట్రం కోసం భారత్‌లో విధ్యార్థుల పోరాటం