జై బోలో తెలంగాణ… పాటలు

http://www.raaga.com/a/?A0002694

జై బోలో తెలంగాణ అందెశ్రీ 

జన జాతరలో మన గీతం
జయకేతనమై ఎగరాలి
జంఝా మారుత జన నినాదమై
జే గంటలు మోగించాలి
        ఒకటే జననం ఓహో…!
        ఒకటే మరణం ఆహా…!
        జీవితమంతా ఓహో…!
        జనమే మననం ఆహా…!
కష్టాల్ నష్టాలెన్నెదురైనా
కార్యదీక్షలో తెలంగాణ
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||
దేశముఖులను దొరభూస్వాముల
గడీల నుండి ఉరికించాం
రజాకారులను తరిమికొట్టి
నైజాముకే గోరి గట్టేశాం
        రోషం గుండెల ఓహో…!
        రోకలి బండలు ఆహా …!
        బిగిసిన పిడికిళ్ళు ఓహో…!
        వడిశెల రాళ్ళు ఆహా…!
వేలకువేలా బలిదానాల
వీరులు చేప్పిన దారుల్లో
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై! బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||
ఆత్మగల్ల మా తెలంగాణకు
అరవై తొమ్మిది గ్రహణం
మూడువందల అరవై తొమ్మిది
విద్యార్థుల బలిదానం
        వంచన వచ్చి ఓహో…!
        పంచను జేరితె ఆహా…!
        సమరాంగణంలో ఓహో…!
        సైంధవులుంటరు ఆహా…!
మోసాలను పసిగడుతూ అమరుల
త్యాగాలను నిలబెట్టే దిశల
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||
తెలంగాణకై విద్యార్థులె
మా ఉద్యమాల తొలి పొద్దులురా…!
ఖాకి జులుం కత్తుల వంతెన
మీద కవాతే చేసిరిరా…!
        ఒడిసిన రక్తం ఓహో…!
        తడిసిన నేల ఆహా…!
        ప్రతినలు బూనిరి ఓహో…!
        ప్రాణాలొడ్డిరి ఆహా…!
నిర్భంధాలు ఎన్నెదురైనా
నిలబడి కలబడి నిగ్గుదేల్చ
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||
నిప్పులు చెరిగే తుపాకీ రవ్వల
గుప్పిట బట్టి నలిపేస్తాం
నెత్తురు చిందె దారుల్లోన
విత్తనాలమై మొలకేస్తాం
        లాఠీలిరిగిన ఓహో…!
        లడాయి మానము ఆహా…!
        పిడుగులు పడ్డా ఓహో…!
        మడమలు తిప్పం ఆహా…!
సమాజ హితమై సాగే పోరులొ
చావో రేవో సాగుదాము
        జై బోలో తెలంగాణ
        గళగర్జనల జడివాన
        జై బోలో తెలంగాణ
        నిలువెల్ల గాయాల వీణా    ||జనజాతరలో||

6 స్పందనలు to “జై బోలో తెలంగాణ… పాటలు”

  1. prataparudra అన్నారు:

    జై బోలో తెలంగాణాకి జై.
    బాగుంది.
    మిగతా పాటలు కూడా పొందు పరచండి.
    అలాగే తెలగానాని ఉర్రూత లూపుతున్న ఉద్యమ గీతాలను
    ఆడించే ప్రయత్నం చేస్తే ఎందరికో ఉపయోగం గా వుంటుంది.

  2. prataparudra అన్నారు:

    జై బోలో తెలంగాణాకి జై.
    బాగుంది.
    మిగతా పాటలు కూడా పొందు పరచండి.
    అలాగే తెలంగాణాని ఉర్రూత లూగిస్తున్న వివిధ ఉద్యమ గీతాలను
    అందించే ప్రయత్నం చేస్తే ఎందరికో ఉపయుక్తంగా వుంటుంది.

  3. saamaanyudu అన్నారు:

    Please join this group and share your solidarity to TStudents..http://www.facebook.com/profile.php?id=100001359926627#!/home.php?sk=group_179345568762928&ap=1

  4. gajula అన్నారు:

    jai telangana

  5. sandeepreddykothapally అన్నారు:

    bagundhi mee pata anni patalu rayandi

  6. thirupathireddy అన్నారు:

    ee cinima chala bagundi rendo part kuda thisi lagadapati ki telangana ante endo telvale

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.